దేశంలో కొత్తగా 5,554 కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో 48,850 క్రియాశీల కేసులు

corona virus-india

న్యూఢిల్లీః దేశంలో గత 24 గంటల్లో నిర్వహించిన 3,76,855 టెస్టుల్లో కొత్తగా 5,554 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 48,850 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 6,322 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. కొత్తగా 16 మంది మరణించారు.దేశంలో ఇప్పటిదాకా నమోదైన కరోనా కేసులు 4,44,90,283కి చేరుకున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,13,294కి చేరుకుంది. వైరస్ వల్ల దేశంలో ఇప్పటివరకు 5,28,139 మంది మృతిచెందారు.

ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 1.47 శాతానికి తగ్గిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. క్రియాశీల రేటు కూడా 0.11 శాతానికి తగ్గిందని తెలిపింది. రివకరీ రేటు 98.70 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. దేశ వ్యాప్త కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటిదాకా 214.77 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/