ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం

East Godavari District: తూర్పుగోదావరి జిల్లా మొగలికుదురులో ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బైక్పై చంచినాడ బ్రిడ్జి వద్ద వశిష్ఠ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/news/movies/