రఘువీరా ను కలిసిన జేసీ ప్రభాకర్ రెడ్డి

రాజకీయ అంశాలులేవని జేసీ వెల్లడి

JC Prabhakar Reddy meets Raghuveera
JC Prabhakar Reddy meets Raghuveera

ఏపీ మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డిని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇందులో రాజకీయాలకు తావులేదని , సీమ బిడ్డలు అంతా ఏకతాటిపైకి వచ్చి జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్‌ తరాల కోసం అంతా కలిసి పోరాడాలని కోరారు.. రాజకీయాల్లో శత్రువులు, మిత్రులు ఉంటారు.. కానీ, పోరాటాలకు కాదన్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.. ఇక, తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదన్న జేసీ.. రాయలసీమ నీటి కోసమే తాను రఘువీరా రెడ్డిని కలిశానని తెలిపారు.

క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/