సిఎం జగన్‌పై విరుచుకుపడ్డ జనసేన పార్టీ
ప్రభుత్వ తీరుపై ఆసక్తికర పోస్టు

అమరావతి: ‘మాట తప్పడంమడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం’ అంటూ జనసేన పార్టీ విరుచుకుపడింది. నాడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ వ్యవహరించిన తీరు, నేడు వ్యవహరిస్తోన్న తీరును గుర్తు చేస్తూ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు చేసింది. నాడు రేట్లు పెరిగాయని జగన్ బాధ నటించాడని జనసేన పేర్కొంది. నేడు ప్రజలపై స్వయంగా భారం వేశాడని వివరిస్తూ పలు అంశాలను ప్రస్తావించింది. మళ్లీ చంద్రబాబు నాయుడికి ఓటు వేస్తే విద్యుత్తు, ఆర్టీసి టిక్కెట్లు, పెట్రోల్ ధరలు, ఇంటి పన్నులు పెంచేస్తాడు అని ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలను జనసేన పోస్ట్ చేసింది. ఇప్పుడు జగన్ పెంచేసిన ధరలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. పెట్రోపై వ్యాట్ పెరిగిన న్యూస్‌ను పోస్ట్ చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/