కూలిన హెలిక్టార్‌..9 మంది సైనికుల మృతి

కొలంబియాలో ఘటన

colombian-military-helicopter-crash

కొలంబియా: కొలంబియాలో ఆర్మీ హెలికాప్ట‌ర్‌ కూలిపోయింది. ఈ ఘటనలో ప‌ద‌కొండు మంది జ‌వాన్లు క‌నిపించ‌కుండా పోయారు. అందులో తొమ్మిది మంది సైనికుల మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు సైన్యం ప్ర‌క‌టించింది. మ‌రో ఇద్ద‌రి ఆచూకీ ల‌భించాల్సి ఉన్న‌ద‌ని అధికారులు తెలిపారు. దేశ ఆగ్నేయ ప్రాంతంలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తున్న గెరిల్లాల‌ను అణ‌చ‌డానికి చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌లో భాగంగా 17 మందితో బ‌య‌ల్దేరిన హెలికాప్ట‌ర్ మంగ‌ళ‌వారం కూలిపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు అందులో 17 మంది సైనికులు ఉన్నార‌ని ఆర్మీ అధికారులు వెల్ల‌డించారు.

కొలంబియాలోని వియ‌ర్ రాష్ట్రంలో ఉన్న ఇనిరిడా న‌ది స‌మీపంలో హెలీకాప్ట‌ర్ శ‌క‌లాల‌ను అధికారులు గుర్తించారు. ఈ న‌దీ ప‌రిస‌రాల్లో ఫార్మ‌ర్ రివ‌ల్యూష‌న‌రీ ఆర్ముడ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా (ఎఫ్ ఏఆర్‌సీ)కి చెందిన గెరిల్లాల ప్ర‌భావం అధికంగా ఉంటుందని తెలిపారు. దీంతో హెలికాప్ట‌ర్‌‌ను గెరిల్లాలు కూల్చివేశారా లేదా ప్ర‌మాదవ‌శాత్తు అది కూలిపోయిందా అనే విష‌యం తెలియాల్సి ఉన్న‌ది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/