కోవిడ్‌-19 ఎఫెక్ట్‌: సౌత్‌ కొరియాలో రెడ్‌ అలర్ట్

Covid-19 virus in South Korea
Covid-19 virus in South Korea

సియోల్‌: చైనాలో పుట్టిన కోవిడ్‌-19 వైరస్ దక్షిణ కొరియాలో వేగంగా ప్రభలుతున్నది. దాంతో ఆ దేశంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సోమవారం ఒక్కరోజే ఆ దేశంలో 161 మందికి కొత్తగా వైరస్ సోకినట్టు తేలింది. కొరియాలో కోవిడ్‌-19 బాధితుల సంఖ్య 763 కు చేరింది. వారం వ్యవధిలోనే 700 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చైనా తర్వాత కోవిడ్‌-19 వైరస్ తో అత్యధిక ప్రభావితం అయిన దేశంగా దక్షిణ కొరియా నిలిచింది. ముఖ్యంగా దయెగు సిటీలోని షిన్ చెనోంజి చర్చి ప్రాంతంలో వైరస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. సోమవారం గుర్తించిన కొత్త కేసుల్లో ఈ ప్రాంతానికి చెందిన వారే 129 మంది ఉండడం గమనార్హం. కరోనాతో కొరియాలో తాజాగా మరో ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య ఏడుకు చేరింది. దేశంలో కరోనా వృద్ధిని అడ్డుకునేందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జయె ఇన్ రెడ్ అలర్ట్ ప్రకటించారు. స్కూళ్లకు సెలవులను ప్రభుత్వం మరో వారం పొడిగించింది. చైనా నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులను రెండు వారాల పాటు నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/