ఘోర రోడ్డు ప్రమాదం..9 మంది మృతి

9 dead, 12 injured after truck hits cruiser in Karnataka’s Tumkur

తమకూరుః ఈరోజు ఉదయం కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లా శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు​ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని తుమకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

ఘటనా సమయంలో జీప్​లో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాదానికి గురైన వారంతా రోజువారీ కూలీలు అని పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తుమకూరు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున అందించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/