సత్తుపల్లి కృష్ణవేణి స్కూల్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు

దేశ వ్యాప్తంగా శుక్రవారం గణతంత్ర వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కృష్ణవేణి స్కూల్ (శ్రీ చైతన్య )లో గణతంత్ర ఉత్సవం అంబరాన్నితాకింది. స్కూల్ ప్రిన్సుపాల్ నాగరాజు, మేనేజెమెంట్ ఆధ్వర్యంలో చైర్మన్ శ్రీధర్ , డైరెక్టర్ శ్రీవిద్య , DGM చేతన్, AGM రమేష్ ప్రోత్సహం తో పరీక్షల పోటీలు , ఆటలు పోటీలు ఎంతో బాగా నిర్వహించి , విజేతలకు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో బహుమతులు అందజేసి చిన్నారుల్లో ఆనందం నింపారు. చిన్నారులకు స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ప్రోత్సహం చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వ‌హించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగరేశారు. ఆ త‌ర్వాత త్రివిద ద‌ళాల‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. .ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ విచ్చేశారు.