న్యూజిలాండ్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

7.3-magnitude earthquake strikes New Zealand’s Kermadec Islands region

న్యూజిలాండ్‌: న్యూజిలాండ్‌లోని కెర్మాడిక్ ద్వీపాల్లో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6: 11 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతతో ఈ భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ సిస్మోలజీ తెలిపింది. దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఇది సంభవిచ్చినట్లు పేర్కొంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. అయితే తీరప్రాంతానికి దగ్గర్లో ఉన్న ప్రజలు వెంటనే ఎత్తైన ప్రదైశాలకు వెళ్లాలంటూ జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ఆదేశించింది. భూకంపం వల్ల సునామీ ఏర్పడి ఉండవచ్చని.. అది న్యూజిలాండ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

ఆ తర్వాత మళ్లీ సునామీ ముప్పు లేదని జాతీయ అత్యవసర నిర్వహణ సంస్థ ట్వీట్ చేసింది. అయినప్పటికీ ప్రజలు సముద్ర తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. కెర్మాడెక్‌ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఈ దీవులు భౌగోళికంగా పసిఫిక్‌, ఆస్ట్రేలియన్‌ టెక్టోనిక్‌ ప్లేట్ల మద్య జరుగుతున్న తాకిడి నుంచి పైకివచ్చిన శిఖరంపై ఏర్పడ్డాయి. దీంతో ఈ రీజియన్‌లో భూకంపాలు సాధరణంగా మారిపోయాయి.