సంక్రాంతి ఎలా జ‌రుపుకోవాలో మేము చూపిస్తాం: సోము వీర్రాజు

సంక్రాంతి అంటే చీర్ గ‌ర్ల్స్ డ్యాన్సులు కావని కొడాలి నాని తెలుసుకోవాలి: సోము వీర్రాజు

అమరావతి : సంక్రాంతి పండుగ ఎలా జ‌రుపుకోవాలో తాము నేర్పిస్తామ‌ని బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు అన్నారు. విజ‌య‌వాడ‌లో త‌మ పార్టీ నేత‌ల‌తో ఉద్యోగుల‌కు మ‌ద్దతుగా ఆయ‌న దీక్ష‌లో పాల్గొన్నారు. కాసేప‌ట్లో ఆయ‌న త‌మ పార్టీ నేత‌ల‌తో క‌లిసి గుడివాడ‌కు బ‌య‌లుదేర‌నున్నారు. క్యాసినో సంస్కృతిని క‌ట్ట‌డి చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సంక్రాంతి ముగింపు సంబ‌రాల్లో పాల్గొనేందుకు నేడు గుడివాడ‌లో బీజేపీ నేత‌ల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిన్న ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు బ్యాన‌ర్లు క‌ట్టారు. అయితే, ఆ బ్యాన‌ర్లను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తొల‌గించారు. అలాగే, కొన్ని ఫ్లెక్సీలు క‌డుతుండ‌గా అడ్డుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై సోము వీర్రాజు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

మరోపక్క గుడివాడ‌లో క్యాసినో క‌ల‌క‌లం చెల‌రేగిన నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు అక్క‌డ ప‌ర్య‌టించ‌నుండ‌డం ఉత్కంఠ రేపుతోంది. సంక్రాంతి అంటే చీర్ డ్యాన్సులు కావని కొడాలి నాని తెలుసుకోవాల‌ని సోము వీర్రాజు ఈ రోజు మీడియాతో అన్నారు. సంక్రాంతి ఎలా జ‌రుపుకోవాలో తాము ఈ రోజు చూపిస్తామ‌ని చెప్పారు. అలాగే, గుడివాడ ప‌ర్య‌ట‌న‌పై బీజేపీ నేత విష్ణువ‌ర్ధ‌న్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. ”ఈరోజు మధ్యాహ్నం బీజేపీ పార్టీ నేతలతో కలసి గుడివాడ వెళ్లడం జరుగుతుంది. క్యాసినో కావాలా, చీర్ గర్ల్స్‌ కావాలా , హరిదాసులు, గంగిరెద్దులు, ధర్మం, మన తెలుగు సంక్రాంతి సంస్కృతి కావాలో గుడివాడ నుండి రాష్ట్ర ప్రజలను అడుగుతాం” అని ఆయ‌న అన్నారు. బీజేపీ నేత‌లు గుడివాడ‌లో ప‌ర్య‌టిస్తున్న నేప‌థ్యంలో పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/