ఆరేళ్ల చిన్నారి ప్రాణం తీసిన చాక్లెట్

కరోనా ఉదృతి తర్వాత పూర్తి స్థాయిలో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో చాలామంది పిల్లలు స్కూల్స్ కు వెళ్లమని మారాం చేస్తున్నారు. కొంతమంది హుషారుగా స్కూల్ బస్సు రాగానే మమ్మీ , డాడీ లకు బై బై చెపుతూ బస్సు ఎక్కుతుంటే..ఇప్పుడే స్కూల్స్ లో జాయిన్ అయినా పిల్లలు స్కూల్ కు వెళ్లమని మారాం చేస్తున్నారు. ఏదోకటి సర్ది చెప్పడం, వారికీ ఇష్టమైనవి ఇచ్చి స్కూల్ కు పంపించడం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ ఆరేళ్ల చిన్నారిని సైతం చాక్లెట్ ఇచ్చి స్కూల్ బస్ ఎక్కించారు. కానీ ఆ తల్లిదండ్రులకు అదే చివరి చూపు అయ్యింది. స్కూల్ బస్ రాగానే హడావిడి ఆ చిన్నారి చాక్లెట్ మిగేసింది. అంతే ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని బైందూర్​ సమీపంలో ఉన్న బిజూర్​ గ్రామానికి చెందిన సమన్వి(6) అనే చిన్నారి.. వివేకానంద స్కూల్​లో మొదటి తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం.. చిన్నారి స్కూల్​కు వెళ్లడానికి మారాం చేయడం తో తల్లిదండ్రులు చిన్నారికి నచ్చజెప్పి చాక్లెట్​ ఇచ్చారు. చాక్లెట్​ను ఆ చిన్నారి తింటున్న సమయంలో స్కూల్​ బస్​ వచ్చేసింది. దీంతో ఆ హడావుడిలో సమన్వి.. ఒక్కసారిగా చాక్లెట్​ను మింగేసింది. ఆ తర్వాత స్కూల్​ బస్​ డోర్​ వద్ద కుప్పకూలింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు.. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. కళ్ల ముందే తమ బిడ్డ చనిపోవడం తో ఆ తల్లిందండ్రులు షాక్లో పడ్డారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.