ఎయిమ్స్‌లో చేరిన మన్మోహన్ సింగ్

జ్వరం, చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిక

Manmohan Singh
Manmohan Singh

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ (87) అస్వస్థతతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. జ్వరం, చాతీలో నొప్పితో బాధపడుతుండడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు మన్మోహన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నారని తెలిపారు. రాత్రి 8:45 గంటల సమయంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ ఆధ్వర్యంలో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు ఆ వర్గాలు వివరించాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/