అమెరికాలో మరోసారి కాల్పులు..ఆరుగురు మృతి

తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు

6 dead in series of shootings in US’s Mississippi, suspect in custody

న్యూయార్క్‌ః అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. టెన్నెసీ స్టేట్ లైన్ సమీపంలోని మిసిస్సిపీ గ్రామీణ టేట్ కౌంటీ వద్ద ఓ ఉన్మాది కాల్పులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మిసిస్సిపీ డిపార్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ అధికార ప్రతినిధి బైలీ మార్టిన్ దీన్ని ధ్రువీకరించారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికైతే అతడు స్వచ్ఛందంగానే కాల్పులకు దిగాడని భావిస్తున్నట్టు, అతడి ఉద్దేశ్యం ఇంకా వెల్లడి కాలేదని ప్రకటించారు.

ప్రమాదం జరిగిన వెంటనే సమీపంలోని ఎలిమెంటరీ, హైస్కూల్ ను మూసివేశారు. కొంత సమయం తర్వాత తిరిగి తెరుచుకున్నాయి. అందరూ క్షేమంగా ఉన్నట్టు ఆయా స్కూల్స్ నిర్వాహకులు ప్రకటించారు. అమెరికాలో జనవరి 23 తర్వాత జరిగిన సామూహిక హత్యాకాండ ఇదే. కనీసం నలుగురు అంతకంటే ఎక్కువ మంది మరణిస్తే సామూహిక హత్యాకాండగా పిలుస్తారు.