మళ్లీ పుంజుకుంటున్న అఖండ కలెక్షన్స్

అఖండ విడుదలై 23 రోజులు కావొస్తున్నా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా సందడి చేస్తుంది. ఇటీవల కాలంలో వారం రోజులు థియేటర్స్ లలో హౌస్ ఫుల్ నడవడమే గగనమైపోయిన ఈరోజుల్లో బాలకృష్ణ నటించిన అఖండ మాత్రం ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవ్వడం విశేషంగా చెప్పుకోవాలి. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో హ్యాట్రిక్ మూవీగా డిసెంబర్ 02 న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లో సైతం భారీ కలెక్షన్లను రాబడుతోంది.

తొలిరోజు నుంచే ‘అఖండ’ మూవీకి భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అలా పది రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కోటి రూపాయలకు పైగానే ఈ సినిమా కలెక్షన్లను రాబట్టింది. కానీ, అప్పటి నుంచి డ్రాప్ అయి మధ్యలో మళ్లీ పుంజుకుంది. ఆ తర్వాత ప్రభావం కోల్పోయింది. కానీ, 23వ రోజు 4 లక్షలు పెంచుకుని తెలుగు రాష్ట్రాల్లో రూ. 19 లక్షలు షేర్‌ను సొంతం చేసుకుంది.

23 రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ చూస్తే.. నైజాంలో రూ. 19.36 కోట్లు, సీడెడ్‌లో రూ. 14.69 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.20 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.91 కోట్లు, గుంటూరులో రూ. 4.58 కోట్లు, కృష్ణాలో రూ. 3.48 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 58.56 కోట్లు షేర్, రూ. 96.25 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇదే తరుణంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి కలెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయి. మొదటి వారంలో గట్టిగానే కలెక్షన్లు రాబట్టినప్పటికీ..రెండోవారం లో తగ్గడం మొదలుపెట్టింది. చాల చోట్ల బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది.
.