29న మరో 5 రాఫెల్ విమానాల రాక

22 నుండి వైమానికి ఉన్నతాధికారుల భేటి

rafel
rafel

న్యూఢిల్లీ: చైనాతో పెరిగిన సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు, చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు వైమానిక దళం ఉన్నతాధికారులు ఈ నెల 22వ తేదీ నుంచి మూడు రోజులపాటు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్‌కేఎస్‌ బదౌరియా, ఏడుగురు కమాండర్‌ ఇన్‌ చీఫ్‌లు పాల్గొంటారని భారత వైమానిక దళం ప్రతినిధి తెలిపారు. చైనా సరిహద్దుల్లో వైమానిక దళం ఇప్పటికే మోహరించింది. మిరేజ్‌జ2000, సుఖోయ్‌జ30, మిగ్‌జ29 తదితర అత్యాధునిక యుద్ధ విమానాలను పలు బేస్‌ స్టేషన్లలో సిద్ధంగా ఉంచింది. మరోవైపు మొదటి దశ రఫేల్‌ ఫైటర్లు జెట్లు ఈ నెల లోనే ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు చేరుకోనున్నాయి. వీటి చేరికతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఈ ఐదు విమానాలను ‘గోల్డెన్ యూరోస్’బృందంలో వాయుసేన చేర్చనుంది. బుధ, గురువారాల్లో ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భడౌరియా నేతృత్వంలో జరిగే సమావేశంలో వాటి ఉపయోగానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/