విజయవంతంగా నింగికెగిసిన ‘హోప్’ మిషన్

జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ప్రయోగం

In its first, UAE launches ‘Hope’ mission to Mars from Japan

జపాన్‌: అరబ్‌ ఎమిరెట్స్‌ మొట్టమెదటి అంగారక యాత్ర సోమవారం తెల్ల‌వారుజామున 1.58 నిమిషాలకు విజయవంతంగా ప్రారంభమైంది. ఎమిరేట్స్ మార్స్ మిషన్‌కు చెందిన హోప్ అంతరిక్ష నౌకను హెచ్11ఏ వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు. అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితుల అధ్యయనమే లక్ష్యంగా చేపట్టిన ఈ మిషన్‌లో 200 రోజుల (దాదాపు ఏడు నెలలు) పాటు యాత్ర సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అంగారక కక్ష్యలోకి చేరు కోనుంది. ఆ తర్వాత 687 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని యూఏఈ స్పేస్ సెంటర్ తెలిపింది. రోజువారీ వాతావరణం, రుతువులు, ఉపరితలంలో గూడుకట్టుకుని ఉన్న ధూళి కణాల లక్షణాలను ఇది పరిశీలిస్తుంది. అమెరికా అంతరిక్ష నిపుణుల వద్ద శిక్షణ పొందిన యూఏఈ ఇంజినీర్లు ఆరేళ్ల కాలంలోనే ‘హోప్’ మిషన్‌ను పూర్తి చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/