అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..ఐదుగురు మృతి

5-dead-18-injured-in-shooting-at-colorado-club

వాషింగ్టన్ః మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కొలరాడోలోని గే నైట్‌క్లబ్‌లో కాల్పులు జరుగగా.. ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. రాత్రి 11.57 గంటలకు కాల్పులు జరిగినట్లు సమాచారం అందిందని పోలీసులు పేర్కొన్నారు. ఓ సాయుధుడు కాల్పులు జరుపగా.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తర్వాత కాల్పులు జరిపిన వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు కారణాలు మాత్రం తెలియరాలేదు. ట్రాన్స్‌ఫోబియా కారణంగా హత్యకు గురైన వారి జ్ఞాపకార్థం ఏటా నవంబర్ 20న ‘ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ (TDOR)’ జరుపుకుంటుండగా కాల్పులు చోటు చేసుకున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/