దేశంలో కొత్తగా 4912 కరోనా కేసులు

యాక్టివ్ కేసులు.. 44,436

New corona virus strain
corona virus

న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4912 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,63,337కు చేరింది. ఇందులో 4,39,90,414 మంది బాధితులు కోలుకోగా, 5,28,487 మంది మృతిచెందారు. మరో 44,436 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 19 మంది కరోనాకు బలవగా, 5719 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 1.62 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.10 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.71 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు 217.41 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని చెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 4,02,946 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,189 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,95,78,357కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 65,38,727 మంది మరణించారు. మరో 4,32,522 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,93,75,175కు చేరింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/