జీడిమెట్ల లో కూలిన 40 ఏళ్ల నాటి ఓ పాత భ‌వ‌నం

హైదరాబాద్ నగరంలో మరోసారి పాత భవనం కూలింది. ఈ ఘటన ఇద్దరికీ స్వల్ప గాయాలు మాత్రం అవ్వడం అందర్నీ ఊపిరి పీల్చుకునేలా చేసింది. GHMC పరిధిలో ఉన్న పాత భవనాలను ఎప్పటికప్పుడు అధికారులు కూల్చేస్తుంటారు. ఎందుకంటే గతంలో పాత భవనాలు కూలిన ఘటనలు పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. దీంతో ఎప్పటికప్పుడు పాత భవనాలపై తనికీలు చేస్తూ సదరు యజమానులకు నోటీసులు జారీ చేస్తుంటారు.

ఇదిలా ఉండగానే బుధువారం జీడిమెట్ల పరిధిలో ఓ పాత భవనం కూలింది. జీడిమెట్ల పరిధిలోని చెరుకుప‌ల్లిలో 40 ఏండ్ల నాటి ఓ పాత భ‌వ‌నం ఈరోజు సాయంత్రం ఆక‌స్మాత్తుగా కుప్ప‌కూలిపోయింది. ఆ పాత భ‌వ‌నానికి మ‌ర‌మ్మ‌తులు చేస్తుండ‌గా కుప్ప‌కూలిపోయిన‌ట్లు స్థానికులు సమాచారం తెలియచేశారు. ప‌క్క‌నున్న మూడు భ‌వ‌నాల‌పై శిథిలాలు ప‌డ‌టంతో గోడ‌లు దెబ్బ‌తిన్నాయి. దీంతో ఇద్ద‌రు వ్య‌క్తుల‌కు స్వ‌ల్ప గాయాలయ్యాయి. కూలిన సమయంలో మనుషులు ఎవ్వరు లేకపోవడం తో పెద్ద ప్రాణాపాయం తప్పింది.