నేటి నుండి వలస కూలీల కోసం 40 రైళ్లు

పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు..సిఎం కెసిఆర్‌

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: సిఎం కెసిఆర్‌ వలస కార్మికుల ఇబ్బందులపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుత…తెలంగాణలో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వరాష్ట్రాలకు పంపేందుకు నేటి నుంచి రోజుకు 40 రైళ్లను నడపనున్నట్టు తెలిపారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు రైళ్లు నడుపుతామని అలాగే, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లను నడపనున్నట్టు సిఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుల్తానియా, జితేందర్‌రెడ్డిలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించింది. కాగా స్వస్థలాలకు వెళ్లేందుకు వివిధ పోలీస్ స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న కార్మికులను ఈ రైళ్ల ద్వారా తరలించనున్నారు. కార్మికులను వారి ప్రాంతాలకు తరలించేందుకు చేస్తున్న ఏర్పాట్ల గురించి వారికి వివరించాల్సిందిగా పోలీసులను సిఎం కెసిఆర్‌ కోరారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/