జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు. నిన్న రాత్రి నాలుగు-ఐదు ప్రదేశాలలో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు పుల్వామాలో ఒక పాకిస్థానీతో సహా జెఎమ్‌కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, గందర్‌బాల్, హంద్వారాలో ఒక్కొక్కరుగా ఎల్‌ఇటికి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యారు. అలాగే ఒక ఉగ్రవాదిని సజీవంగా అరెస్టు చేశామని కశ్మీర్ ఐజీపీ తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలోని సెర్చ్ ప్రాంతంలో ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ LeTకి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని చెవా కలాన్ ప్రాంతంలో రాత్రిపూట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/