కామినేని ఆసుప‌త్రిలో చేరిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హైదరాబాద్ లోని కామినేని హాస్పటల్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈమె యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కే మూవీ లో నటిస్తుంది. ఈ సినిమాను వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై నాగ్ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ లో బిగ్ బి కూడా ఓ కీలక పాత్ర చేస్తుండడం విశేషం. కాగా ఈ మూవీ షూటింగ్ గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఈ షూటింగ్ లో పాల్గొన్న దీపికా..ఈరోజు మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి హార్ట్ బీట్ పెరిగిపోయింద‌ని కంగారుప‌డ్డ దీపిక ప‌దుకొనే షూటింగ్ ర‌ద్దు చేసుకుని హుటాహుటీన కామినేని ఆసుపత్రికి వ‌చ్చారు. కామినేని ఆసుప‌త్రిలో ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం ఆమె తాను బ‌స చేసిన నోవాటెల్ హోట‌ల్‌కు వెళ్లిపోయారు. నోవాటెల్‌లోనూ ఆమె వైద్యుల ప‌ర్యవేక్ష‌ణ‌లోనే ఉన్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం దీపిక ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం ఏమీ లేద‌ని ఆమెకు వైద్యులు సూచించిన‌ట్టు స‌మాచారం. ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్‌ ఆటగాడు ప్రకాష్‌ పదుకొణె కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది బ్యూటిఫుల్‌ దీపికా పదుకొణె. తనదైన అందం, నటనతో అనేక అభిమానులను సంపాదించుకుంది. డైలాగ్‌ డెలివరీ, ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ బీటౌన్‌లో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది దీపికా పదుకొణె.