ఏపీలో కొత్తగా 3,841 కరోనా కేసులు

అమరావతి : ఏపీ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,841 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 38 మంది చనిపోయారు. కాగా 3,963 మంది కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా పాజిటివ్‌ కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 18,93,354కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 38,178గా ఉంది.

జిల్లాల వారీగా నమోదైన కొవిడ్‌ మరణాల వివరాలిలా ఉన్నాయి. కృష్ణలో ఎనిమిది మంది, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరులో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపూరం, వైఎస్‌ఆర్‌ కడప, విజయనగరంలో ఇద్దరు చొప్పున, కర్నూల్‌, నెల్లూరు, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/