వెనిగర్ తో శుభ్రం చేయండి

ఇల్లు, పరిసరాలు పరిశుభ్రత

నేల, వంట గది, స్నానాల గది. ఇలా ఒక్కోదాన్ని శుభ్రం చేయటానికి ఒక్కో లిక్విడ్ వాడుతుంటాం. వాటిల్లోని రసాయనాలతో ప్రమాదం కదా .. బదులుగా వైట్ వెనిగర్ ప్రయత్నించి చూడండి..


ఒక వంతు నీళ్లకు, రెండు వంతుల వెనిగర్ కలిపి, స్ప్రి బాటిల్ లో పోయండి… దాంతో అద్దాలు, కిటికీలను తుడిస్తే దుమ్ము, మరకలు పోవటమే కాదు. మెరుస్తాయి కూడా.. వంట గట్టు పదే పదే తుడుస్తుంటాం. శుభ్రంగా కన్పించడానికే కాదు.. బాక్టీరియా వగైరా చే చేరతాయన్న భయమూ దానికి కారణమే. అర గ్లాసు చొప్పున వెనిగర్ , నీళ్లు తీసుకుని, దానికి కొన్ని చుక్క లిక్విడ్ సోప్ కలిపి చదవండి.. మొండి మరకలు పోతాయి.. ఇంకా దుర్వాసనలు, కీటకాల బెడద ఉండదు .
స్నానాలగది గోడ అంతా సబ్బు మరకలతో నిండి. త్వరగా వదలవు.. వైట్ వెనిగర్ కు బేకింగ్ సోడా కలిపి , స్పాంజ్ తో రుద్దండి.. కొద్దీ సేపయ్యాక రుద్ది కడిగితే మరకలు మాయం .
టాయిలెట్ కొద్ది రోజులకే రంగు మారటం గమనిస్తుంటాం..కదా… డాన్ని వెనిగర్ ని నేరుగా పోసి 2,3 గంటలు వదిలేయండి.. తర్వాత నీటితో రుద్ది కడిగేస్తే సరి. అయితే వెనిగర్ ఘాడత పోవటానికి మాత్రం కొంత సమయం పడుతుంది. త్వరగా వదలాలంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ను చల్లటం మేలు . గచ్చు తుడిచాక నేల మీద ఎండిన నీటి మరకలు కన్పిస్తుంటాయి.. అర బకెట్ నీళ్లకు పావు కప్పు వెనిగర్ కలిపి తుడిచి చూడండి.

తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/category/telangana/