కువైట్‌లో 24 గంటల్లో 608 కొత్త కేసులు

మొత్తం కేసుల సంఖ్య 22,575

Kuwait reports 608 new coronavirus

కువైట్‌: సౌదీ, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. కువైట్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో 608 కొత్త కేసులు న‌మోదైన‌ట్లు ఆ దేశ ఆరోగ్య‌మంత్రిత్వ శాఖ మంగ‌ళ‌వారం వెల్ల‌డించింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ కువైట్‌లో కోవిడ్ బారిన ప‌డ్డ వారి సంఖ్య 22,575కి చేరింది. నిన్న సంభ‌వించిన 7 మ‌ర‌ణాల‌తో క‌లిపి ఆ దేశంలో క‌రోనా వ‌ల్ల చ‌నిపోయిన వారు 172 మంది అయ్యారు. ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక‌ ప్ర‌తినిధి అబ్దుల్లా అల్ స‌న‌ద్ మాట్లాడుతూ… 196 మంది బాధితులు ఐసీయూల్లో చికిత్స పొందుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా 15,097 మంది కోవిడ్ పేషెంట్స్‌ వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నార‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇక ఈ మ‌హ‌మ్మారి వ్యాప్తి నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టికే కువైట్‌లో క‌రోనా టెస్టులు ముమ్మ‌రం చేశామ‌ని స‌న‌ద్ పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/