ఎమ్మెల్యె పిన్నెల్లిపై దాడిని ఖండించిన రోజా

MLA Roja
MLA Roja

అమరావతి: వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యె పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై జరిగిన దాడిని కదిరి ఎమ్యెల్యె, ఏపిఐఐసి చైర్‌పర్సన్‌ రోజా తీవ్రంగా ఖండించారు. రైతులు జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో ఉండగా.. అటుగా వచ్చిన ఎమ్మెల్యె పిన్నెల్లి వాహనంపై దాడిని జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడిని కొందరు కావాలనే చేశారని రోజా ఆరోపించారు. రైతుల ముసుగులో దాడి చేసింది కొంతమంది టిడిపి వాళ్లేనని రోజా అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. వారిపై చర్యలు తీసుకోకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. గత 20 రోజులు రాజధాని ప్రాంతాల్లో రైతులు ఆందోళన చేస్తున్నా పోలీసులు అభ్యంతరం తెలిపినట్లు ఎక్కడైనా చెప్పారా అని ప్రశ్నించారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడంలో ఏం తప్పుందని రోజా అన్నారు. ఈ అంశంపై సిఎం జగన్‌ స్పష్టమైన ప్రకటన చేస్తారన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/