శివరాజ్‌సింగ్‌ నేతృత్వంలో కొత్త మంత్రులు ప్రమాణం

అత్యధికులు సింధియా వర్గానికి చెందినవారే

శివరాజ్‌సింగ్‌ నేతృత్వంలో కొత్త మంత్రులు ప్రమాణం
Madhya Pradesh’s New Cabinet, The Jyotiraditya Scindia Impact

భోపాల్‌: మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ తన కేబినెట్లో కొత్తగా 28 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మధ్యప్రదేశ్‌ అడిషనల్‌ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ గురువారం ఉదయం రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన మంత్రివర్గంలో అత్యధికులు జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందినవారు కావడం విశేషం. కాంగ్రెస్‌తో విభేదాల అనంతరం బిజెపిలో చేరిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేల్లో 14 మందికి చోటు దక్కింది. తాజా మంత్రులతో కలిపి ప్రస్తుతం మధ్య ప్రదేశ్ క్యాబినెట్లో సింధియా శిబిరం బలం 14కి చేరింది. ఇంతకు ముందే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు దక్కించుకున్నారు. 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో కొవిడ్19 ప్రోటోకాల్‌‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు. ఇవాళ ప్రమాణం చేసిన కొత్త మంత్రుల్లో 20 మంది క్యాబినెట్ ర్యాంకు దక్కించుకోగా.. మిగతా ఎనిమిది మంది సహాయమంత్రులుగా కొనసాగనున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/