జ‌మ్ముక‌శ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

శ్రీన‌గ‌ర్ : జమ్మూ కశ్మీర్‌లో మంగళవారం చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందులో ఒక‌రిని ముఖ్త‌ర్ షాగా పోలీసులు గుర్తించారు. ఇతడు గతంలో బిహార్‌కు చెందిన వీరేంద్ర పాశ్వాన్‌ను హత్య చేసిన అనంతరం సోఫియాన్‌కు పారిపోయాడు. దీని గురించి కశ్మీర్‌ జోన్‌ పోలీసులు ట్విట్‌ చేశారు. ఘ‌ట‌నాస్థ‌లి నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇక సోమ‌వారం ఉగ్ర‌వాదుల కాల్పుల్లో ఐదుగురు జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో పూంచ్ సెక్టార్‌లో బ‌ల‌గాల సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/