విజయ్ వారసుడు నుండి ” రంజితమే” సాంగ్ రిలీజ్

విజయ్ నటిస్తున్న వారసుడు మూవీ నుండి ఫస్ట్ సింగిల్ రంజితమే రిలీజ్ అయ్యింది. విజయ్ – రష్మిక జంటగా వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం వారసుడు. తెలుగు , తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుండి ” రంజితమే” అనే పాటని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ సాంగ్ లో విజయ్ తలపతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టాడని చెప్పొచ్చు.

ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కుష్బూ, మీనా, ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, యోగి బాబు, సంగీత తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో ఈ సినిమాకి ‘వరిసు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. విజయ్ జోడీగా ఫస్ట్ టైమ్ రష్మిక అలరించనుంది. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘బీస్ట్’ తరువాత విజయ్ నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

YouTube video