అమెరికాలో కాల్పుల క‌ల‌క‌లం ..ముగ్గురు మృతి

టెక్సాస్ : అమెరికాలోని టెక్సాస్‌లో బుధ‌వారం రాత్రి కాల్పులు క‌ల‌క‌లం సృష్టించాయి. హ్యుస్ట‌న్ పోలీసుల ప్ర‌కారం.. ఓ అపార్ట్‌మెంట్ వెలుప‌ల బుధ‌వారం రాత్రి 11 గంట‌ల స‌మ‌యంలో కాల్పులు సంభ‌వించాయని తెలిపారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ కార‌ణంగానే ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిపి కాల్పుల‌కు పాల్ప‌డ్డారు. ఐదుగురిపై కాల్పులు జ‌ర‌ప‌గా, ముగ్గురు మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. మృతుల్లో ఇద్ద‌రు 18 ఏండ్ల వ‌య‌సు క‌లిగిన వారు కాగా, మ‌రొక‌రిది 40 ఏండ్ల వ‌య‌సు. కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/