కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం బిజీ బిజీ

కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంలో బిజీ గా ఉన్నారు. తాజాగా, టాలీవుడ్ సీనియర్ కమెడియన్ బ్రహ్మానందం కూడా కన్నడ నాట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ కోసం గెలుపు కోసం ఆయన ప్రచారంలోకి దిగారు. ఈరోజు చిక్ బళ్లాపూర్ లో బ్రహ్మానందం సందడి చేశారు. తనదైన శైలిలో ఓటర్లను అకట్టుకునేందుకు ప్రయత్నించారు.

బ్రహ్మానందం ఇటీవల చిక్కబళ్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నియోజకవర్గంలో చాలా మంది తెలుగు మాట్లాడేవారు ఉండటంతో ప్రజలతో మమేకమై తెలుగులో మాట్లాడారు. నటుడు ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్‌కు తన మద్దతునిచ్చాడు. అతని కోసం చిక్కబల్లాపూర్‌లో ప్రచారం చేశాడు. రాష్ట్రంలో డాక్టర్ కె.సుధాకర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఎన్నో వినూత్న పథకాలు తీసుకువచ్చి, దేశం దృష్టి కర్ణాటకపై పడేలా చేశారని బ్రహ్మీ కొనియాడారు. తమలాంటి వాళ్లం ఇవాళ సుధాకర్ గారి కోసం ప్రచారం చేస్తున్నామని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని వెల్లడించారు. కాగా, రాత్రి 10 గంటల వరకు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.