గవర్నర్ తో రాష్ట్ర ఎన్నికల అధికారి భేటీ
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ !

Amaravati: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్నికల వాయిదాకు కారణాలపై రమేష్‌కుమార్ గవర్నర్‌కు వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం ఆరు వారాలపాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఎన్నికలను వాయిదా వేయడంపై తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్ నిన్న గవర్నర్‌కు కలిసి ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/