విహార నౌకలో 21 మందికి కరోనా వైరస్‌

గ్రాండ్ ప్రిన్సెస్ విహార నౌకలో 3500 మంది పర్యాటకులు

grand princess cruise ship
grand princess cruise ship

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలోని సముద్రంలో ఉన్న గ్రాండ్ ప్రిన్సెస్ విహారనౌకలో 21 మందికి కరోనా వైరస్ సోకిందని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ వెల్లడించారు. ప్రస్తుతం శాన్‌ఫ్రాన్సిస్కో తీరంలో ఉన్న ఈ నౌకలో మొత్తం 3500 మంది ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా 21 మందిలో కరోనా వైరస్ వున్నట్టు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయని పెన్స్ తెలిపారు. నౌకను తీరానికి తీసుకొచ్చి చికిత్స అందిస్తామని వైద్యులు తెలిపారు. కాగా, కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 3400 మంది మృతి చెందగా, లక్షకుపైగా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. 55,800 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక భారత్‌లో ఇప్పటి వరకు 31 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/