ప్రముఖులు లక్ష్యంగా ఉగ్ర దాడులు

ముఖ్యమైన నగర పర్యటనల్లో అప్రమత్తంగా ఉండాలి ..ఇంటెలిజెన్స్ బ్యూరో సూచన

Amit Shah
Amit Shah

గుజరాత్‌: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్, సూరత్, వడోదరా, రాజ్ కోట్ ప్రధాన నగరాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్రాన్ని హెచ్చరించింది. అంతేకాక ఈ దాడులు ప్రముఖులు లక్ష్యంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర హోం మంత్రి హరేనాపాండ్యా సహా పలువురు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు ఉగ్రమూకలు పాగా వేసి ఉన్నాయని, ఆయా నగరాల్లోని పోలీసు బలగాలు సదా అప్రమత్తంగా ఉండాలని తమ నివేదికలో పేర్కొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/