వారసుడు ట్రైలర్ ఎలా ఉందంటే

సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్య , వీర సింహ రెడ్డి తో పాటు తమిళ్ హీరో విజయ్ నటించిన వారసుడు మూవీ కూడా థియేటర్స్ లోకి రాబోతుంది. మహర్షి ఫేమ్ వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు , తమిళ్ భాషలతో పాటు మిగతా భాషల్లో పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ ఇలా ప్రతిదీ సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా చిత్ర అసలైన ట్రైలర్ వచ్చేసింది.

ట్రైలర్ విషయానికి వస్తే..ఇళ్లనేది ఇటుక ఇసుకేరా వదిలేసి వెళ్లిపోవచ్చు. కుటుంబం అలా కాదుగా అంటూ తల్లి పాత్రలో జయసుధ చెబుతున్న డైలాగ్ లతో వారసుడు ట్రైలర్ ప్రారంభమైంది. గ్రేట్ సర్ ఈ కాలంలో కూడా జాయింగ్ ఫ్యామిలీగా వుండటం రేర్ సర్..ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే..మీరు మీ ఇద్దరు కొడుకుల్నే ఫ్యామిలీ అని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ మీ చిన్న కొడుకు గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు` అంటూ సమన్ అనడం… ఇదే క్రమంలో విజయ్ ఎంట్రీ ఇవ్వడం ఇవ్వన్నీ హైలైట్ గా ఉన్నాయి.

ఇన్ బిజినెస్ ఆల్ వేస్ అలర్ట్.. వేటగాడు తన కళ్లల్లో మట్టి పడినా కూడా కళ్లు తెరిచే వుంచాలి… అని శ్యామ్ అనడం.. వేట గాడికి వేటే వృత్తి వెళ్లి మీ నాన్నకు చెప్పు..ఈ సీట్లో హీటేంటో ఇక మీదట చూస్తారని విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ బెదిరించడం.. పవర్ సీట్లో వుండదు సార్…అందులో వచ్చి ఒకడు కూర్చుంటాడే వాడిలో వుంటది.మన పవర్ ఆ రకం..` మామా నువ్వు ఏదిచ్చినా ట్రిపుల్ గా తిరిగిచ్చేస్తా అంటూ విజయ్ చెబుతున్న పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవన్నీ కూడా సినిమా ఫై అంచనాలు పెంచాయి.

YouTube video