కోహ్లీపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

లాహోర్: న్యూజిలాండ్‌తో జరిగిన వరుస సిరీస్‌లలో టీమిండియా ఓటమి పాలవ్వడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. కోహ్లీపైనా పలువురు విమర్శకులు తీవ్రంగా వ్యవహరిస్తున్నారు. అయితే పాకిస్తాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. అసలు అతడి టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారని ఇంజమామ్ ప్రశ్నించాడు.తాజాగా ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ… ‘చాలామంది విరాట్ కోహ్లీ టెక్నిక్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది విన్న నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ 70 శతకాలు చేశాడు. అలాంటప్పుడు అతడి టెక్నిక్‌ను ఎలా ప్రశ్నిస్తారు.
కొన్ని సార్లు ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా పరుగులు సాధించలేరు. క్రికెటర్లు ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి దశను ఎదుర్కొంటారు. ఇది ఒకటో రెండో సిరీస్‌లకు మాత్రమే పరిమితమవుతుంది’ అని అన్నారు.’విరాట్ కోహ్లీ ఎంతో బలమైన మైండ్ ప్లేయర్. గొప్ప ఆటగాడికి ఆలోచన ధోరణి బలంగా ఉంటే సులువుగా తిరిగి పుంజుకొగలడు. కోహ్లీ కచ్చితంగా పుంజుకుంటాడు. కొన్ని సార్లు బలాలే మన బలహీనతలు అవుతాయి. ఎక్కడ ఎక్కువగా పరుగులు సాధిస్తామో.. అక్కడే ఔట్ అవ్వాల్సి వస్తుంది. కోహ్లీ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో ఎటువంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు’ అని ఇంజమామ్ చెప్పుకొచ్చాడు.
తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/nri/