అమరావతిలో రేపటి నుండి సకల జనుల సమ్మె

ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పిన రైతులు

Amaravati
Amaravati

అమరావతి: ఏపి రాజధానిగా అమరావతే ఉండాలని 16 రోజులుగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ఏపీ ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో రాజధాని రైతులు మలి దశ ఉద్యమానికి సిద్ధమయ్యారు. రేపటి నుంచి సకల జనుల సమ్మెకు నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పౌర సరఫరా తప్ప మిగతా అన్ని కార్యకలాపాలు బంద్ చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచుతామని తేల్చి చెప్పారు. రాజధానిలోని అన్ని గ్రామాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. కాగా, అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు తుమ్మల సత్య, పెందుర్తి శ్రీకాంత్ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి దీన్ని ప్రారంభించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/