రూ. 14.74 ల‌క్ష‌ల‌తో కట్టిన బ్రిడ్జి .. 2 నెల‌ల‌కే వ‌ర‌ద పాలు

ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో రూ. 14.74 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెల‌ల క్రితం ప్రారంభించ‌గా, నిన్న కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి కొట్టుకుపోయింది. ఈ ఘటనతో స్థానికులు అయ్యో అంటూ ఆవేదన వక్తం చేస్తున్నారు. నార్త్ లో గత కొద్దీ రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదుల ప్రవాహానికి వందలాది ఇల్లులు , అనేక బ్రిడ్జ్ లు కొట్టుకపోతున్నాయి.

ముఖ్యంగా ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో రూ. 14.74 ల‌క్ష‌ల వ్య‌యంతో నిర్మించిన బ్రిడ్జిని రెండు నెల‌ల క్రితం ప్రారంభించ‌గా, నిన్న కురిసిన కుండ‌పోత వ‌ర్షానికి కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సోల‌నీ న‌దిపై ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయ‌డంతో.. దీని ద్వారా స్థానికులు ఇత‌ర ప్రాంతాల‌కు రాక‌పోక‌లు కొన‌సాగించేవారు. కానీ ఇప్పుడు ఆ బ్రిడ్జి కొట్టుకవడం తో అయ్యో అంటున్నారు. నాసిర‌కంగా ప‌నులు చేప‌ట్ట‌డంతోనే బ్రిడ్జి వ‌ర‌ద‌పాలైంద‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డడంతో ప‌లు ఇండ్లు ధ్వంస‌మ‌య్యాయి. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో హిమాచ‌ల్‌లోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. మ‌రో 24 గంట‌ల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నందున ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌కే ప‌రిమితం కావాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతేనే బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు. అధికారుల‌కు, పోలీసుల‌కు స్థానికులు స‌హ‌క‌రించాల‌ని కోరారు.