మరోసారి అమెరికాలో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి

2 dead in shooting rampage in US, 19-year-old gunman in custody

టెన్నెస్సీః మరోసారి అమెరికాలో తుపాకీ రక్కసి కోరలు చాచింది. టెన్నెస్సీ రాష్ట్రంలో మెంఫిస్‌లో 19 ఏండ్ల యువకుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎజెకిల్‌ కెల్లీ అనే 19 ఏండ్ల యువకుడు మెంఫిస్‌ పట్టణలో తిరుగుతూ జనాలపై కాల్పులకు తెగబడ్డాడని పోలీసులు వెల్లడించారు. కాల్పుల అనంతరం తన వాహనాన్ని అక్కడే వదిలి కారును హైజాక్‌ చేశాడని తెలిపారు. అతనికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.

సమస్య పరిష్కారమయ్యేవరకు పట్టణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు రావద్దని సూచించారు. కాల్పుల ఘటనను ఫేస్‌బుక్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేశాడని అధికారులు వెల్లడించారు. ఇక మెంఫిస్‌ యూనివర్సిటీ తన విద్యార్థులకు హెచ్చరిక జారీచేసింది. వర్సిటీకి నాలుగు మైళ్ల దూరంలో కాల్పులు జరిగాయని.. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/