అమెరికాలో కాల్పుల కలకలం..ఇద్దరు మృతి

Fire in America
Fire in America

అమెరికా: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోలో మ్యూజిక్ క్లబ్‌ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇద్దరు స్పాన్సర్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే ఈ దారుణానికి కారణమైనట్టు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/