బిజెపి జాతీయ అధ్యక్ష పదవికి నడ్డా నామినేషన్‌

ఈరోజు మొదలై ఎన్నికల ప్రక్రియ ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ

NADDA
NADDA

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షునిగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఎన్నిక లాంచనమేనని భావిస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నిక ప్రక్రియను నిర్వహించి ఆయన ఎన్నికైనట్లు ప్రకటించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ రోజు ఉదయం ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12.30 నుంచి 1.30 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 1.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే రేపు ఎన్నిక నిర్వహిస్తారు.కాగా, ఈ రోజు ఉదయం 10 గంటలకు పార్టీ అతిరథ మహారథుల సమక్షంలో నడ్డా తన నామినేషన్ దాఖలు చేశారు. మరెవరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేకపోవడంతో పార్టీ ఎన్నికల నిర్వహణ ఇన్ చార్జి రాధామోహన్ సింగ్ మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించే అవకాశం ఉంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/