దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568

corona virus- india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 17,092 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 14,684 మంది కరోనా నుంచి కోలుకోగా… 29 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,09,568కి పెరిగింది. తాజా కేసులతో కలిసి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,34,86,326కి పెరిగింది. వీరిలో 4,28,51,590 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 5,25,168 మంది మృతి చెందారు.

ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.14 శాతంగా, క్రియాశీలక రేటు 0.25 శాతంగా, రికవరీ రేటు 98.54 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 1,97,84,80,015 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న 9,09,776 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/