మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ డే కలెక్షన్స్

విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో నితిన్..తాజాగా “మాచర్ల నియోజకవర్గం” అనే మూవీ తో నిన్న (ఆగస్టు 12 న) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను శేఖర్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించగా ..ఉప్పెన ఫేమ్ శృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై నిర్మితమైన ఈ చిత్రానికి మిశ్రమ టాక్ వచ్చింది. అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఫస్ట్ డే కలెక్షన్లు కుమ్మేసాయి. రెండు రాష్ట్రాల్లో 4.62 కోట్ల షేర్‌ను 7.05 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు తెలుస్తుంది.

ఏరియాల వారిగా కలెక్షన్స్‌ను చూస్తే…

నైజాం – 1.42 కోట్లు
సీడెడ్ – 75 లక్షలు
ఉత్తరాంధ్ర – 68 లక్షలు
తూర్పు – 46 లక్షలు
పశ్చిమ – 19 లక్షలు
గుంటూరు – 56లక్షలు
కృష్ణ – 30లక్షలు
నెల్లూరు – 26లక్షలు
మొత్తంగా ఏపీ తెలంగాణలో 4.62 కోట్ల షేర్ వచ్చినట్లు తెలుస్తోంది.

మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. నైజాంలో 6 కోట్లు, సీడెడ్‌లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లతో కలిపి మొత్తంగా 19 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్ళో 1 కోటి, ఓవర్సీస్‌లో 1.2 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 21.2 కోట్లకుపైగా బిజినెస్ నమోదు చేసింది.