లోయలో పడిన వాహనం…17 మంది మృతి

17 die after vehicle overturns near Kawardha area in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కవర్దా ప్రాంతంలో వాహనం బోల్తాపడి 17 మంది మృతి చెందారు. 8 మందికి గాయాలయ్యాయి. కబీర్‌ధామ్ జిల్లాలో ఓ లోయలో వాహనం పడిపోయింది. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తోంది. బైగా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన 25 నుంచి 30 మంది బీడీ ఆకుల కోసం వెళ్లారు. ఆకులు ఏరిన తర్వాత వారిని పికప్ వాహనం వెనక్కి తీసుకువస్తోంది.

ఈ సమయంలో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా కుయ్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. బైగా కమ్యూనిటీ ఎక్కువగా బీడీలు చేస్తుంది. బీడీ ఆకు కోసం వీరు అడవులకు వెళుతుంటారు. అయితే ఈ ఆకులు మార్చి నుంచి మే మధ్య వస్తాయి.