పంజాబ్‌లో 8 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమ్ ఆద్మీ అభ్య‌ర్థుల‌ ప్ర‌క‌టన

AAP releases first list of 8 candidates for Punjab

చండీఘ‌డ్‌: పంజాబ్‌లో 8 లోక్‌స‌భ స్థానాల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయ‌నున్న‌ది. ఆ 8 మంది స‌భ్యుల జాబితాను రిలీజ్ చేశారు. దీంట్లో అయిదు మంది ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులే ఉన్నారు. అమృత్‌స‌ర్ నుంచి మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్, ఖ‌ద్దూర్ సాహిబ్ నుంచి లాల్‌జిత్ సింగ్ భుల్లార్‌, బ‌ఠిండా నుంచి గుర్మీత్ సింగ్ కుడియా, సంగ్రూర్ నుంచి గుర్మీత్ సింగ్ మీట్ హ‌య‌ర్‌, పాటియాలా నుంచి బ‌ల్బీర్ సింగ్ పోటీ చేయ‌నున్నారు. ఫ‌తేఘ‌ర్ సాహిబ్ సీటు నుంచి గురుప్రీత్ సింగ్ జీపీని రంగంలోకి దించారు. మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన ఆయ‌న ఈమధ్యే ఆప్‌లో చేరారు. ఫ‌రీద్‌కోట్ స్థానం నుంచి పంజాబీ న‌టుడు క‌రంజిత్ అన్మోల్ పోటీలో ఉన్నారు. పంజాబ్‌లో మొత్తం 13 పార్ల‌మెంట‌రీ స్థానాలు ఉన్న విష‌యం తెలిసిందే.