ఒక్క రోజే దేశంలో 16 కొత్త ఓమిక్రాన్ కేసులు..

omicron variant

ఓమిక్రాన్ మహమ్మారి దేశంలో రోజురోజుకు చాపకింద నీరులా నెమ్మదిగా విస్తరిస్తుంది. నిన్నటి వరకు ఒకటి రెండు మాత్రమే నమోదు అవుతుండగా..ఈరోజు ఏకంగా 16 కొత్త కేసులు నమోదై అందరికి షాక్ ఇచ్చింది. వీటిలో మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 4, ఢిల్లీలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. వీటిలో మహారాష్ట్రలో 8, రాజస్థాన్ లో 4, ఢిల్లీలో 4 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 57కు చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తర్వాతి స్థానంలో రాజస్థాన్ 13 ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా… ఢిల్లీలో 6, కర్ణాటకలో 3, గుజరాత్ లో 4, కేరళలో 1, ఏపీలో 1, ఛండీగడ్ లో1 చొప్పున ఓమిక్రాన్ కేసులు నమోదయ్యయాయి.

కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉన్నప్పటికీ కొత్తగా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతోండటం ఆందోళనకర పరిణామం. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. కొత్త వేరియంట్‌ ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తోందోనని జనం భయపడుతున్నారు. సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని కలవరపెడుతోంది. వ్యాపారాలు ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్నాయి. పరిశ్రమల్లో ఉత్పత్తి గాడిన పడుతోంది. లాక్‌డౌన్‌లతో నష్టపోయిన అన్ని వర్గాలూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ తరుణంలో ఓమిక్రాన్‌ కేసులు పెరుగడం అందరినీ ఆందోళకు గురి చేస్తోంది.