టీఎస్‌ఆర్టీసీ మరో ముందడగు వేసింది

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ఎంప్లాయీస్‌ వేల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు

tsrtc
tsrtc

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌బోర్డును ఏర్పాటు చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం మరోముందడుగు వేసింది. ఆర్టీసిలో కార్మిక సంఘాలు లేకుండా వేల్ఫేర్‌ బోర్డు చేసుకొని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కార్మికులకు సూచించిన సంగతి తెలిసిందే. కెసిఆర్‌ సూచన మేరకు ఆర్టీసీలో కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను పేర్కొంటూ సర్క్యులర్‌ జారీ చేశారు. ఉద్యోగులు వారి సమస్యలను సులువుగా చెప్పుకొనేందుకు వీలుగా బోర్డు సభ్యులు అందుబాటులో ఉండనున్నారు. ఉద్యోగుల ఫిర్యాదులను డిపో, రీజినల్‌, కార్పోరేషన్‌ స్థాయిగా డిపో మేనేజర్లు పరిశీలించి విభజిస్తారు. చార్టు సమస్యలు, జీతాలు, అలవెన్సులు, సెలవులు, రీయింబర్స్‌మెంట్‌ తదితర సమస్యలను డిపో స్థాయిగా పేర్కొన్నారు. బదిలీలు, ప్రమోషన్లు, సీనియారిటీ వంటివి రీజినల్‌ స్థాయిలో పరిష్కరిస్తారు. మిగతా అంశాలు కార్పొరేషన్‌ స్థాయికి వెళతాయి. సూపర్‌వైజర్లతో కలిసి డిపో మేనేజర్‌ రోజువారిగా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి పరిష్కారిస్తారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/