న్యూయార్క్‌లో కాల్పుల కలకలం

న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పులు సంభవించాయి. న్యూయార్క్‌లోని రోచెస్టర్‌లో అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. రోచెస్టర్‌లోని పబ్లిక్ మార్కెట్ పరిసరాల్లో వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 16 మంది గాయపడగా.. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటలకు, భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం సుమారు 11 గంటలకు కాల్పులు జరిగాయి.
కాగా, దేశంలో నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా రోచెస్టర్‌లో అర్థరాత్రి వరకు ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళన కొనసాగుతుండగానే వారిపై కాల్పులు చోటుచేసుకున్నాయి.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/