హైదరాబాదులో 14 కిలోల డ్రగ్స్ పట్టివేత

ఫొటో ఫ్రేముల్లో పెట్టి డ్రగ్స్ ఎగుమతి


హైదరాబాద్: హైదరాబాదులో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట్ ఇంటర్నేషనల్ పార్శిల్స్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలను నిర్వర్తించగా 14 కిలోల డ్రగ్స్ లభ్యమయ్యాయి. దీని విలువ రూ. 5.5 కోట్లుగా ఉంటుందని పోలీసులు చెపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్ పంపుతున్నట్టు సమాచారం. ఫోటో ఫ్రేముల్లో పెట్టి ఈ డ్రగ్స్ ను దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/