హరీష్ రావు వైద్య శాఖ అందుకున్నాడో లేదో వారందరి జీతాలు చెల్లించాలని ఆదేశం

minister-harish-rao

ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గా ఉన్న హ‌రీష్ రావు కు కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతను అప్పగించారు. భూ అక్రమ కేసు కారణంగా కేసీఆర్ ఈటలను మంత్రి వ‌ర్గం నుంచి భ‌ర్త‌ర‌ఫ్ చేసి.. ఆ తర్వాత వైద్య శాఖ ను తీసుకున్నారు. ఇక ఇప్పుడు హరీష్ రావు కు ఆ బాధ్యత అప్పగించారు. బాధ్యత తీసుకున్నాడో లేదో హరీష్ రావు తన దూకుడు మొదలుపెట్టాడు.

గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హ‌రీష్ రావు స‌మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌కు కీలక ఆదేశాలు జారీ చేశారు. జాతీయ స‌గ‌టును మించి తెలంగాణ రాష్ట్రం లో వ్యాక్సినేష‌న్ జరుగాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వేగం మ‌రింత పెంచాల‌ని మంత్రి హ‌రీష్ రావు ఆదేశించారు.

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 350 ప‌డ‌క‌లు గ‌ల కింగ్ కోఠి జిల్లా ద‌వాఖాన‌లో సాధార‌ణ వైద్య‌సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ‌ చేయాలని పేర్కొన్నారు. టిమ్స్ హాస్పిట‌ల్‌లో 200 ప‌డ‌క‌లు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మిన‌హా సాధార‌ణ వైద్య సేవ‌లు ప్రారంభం చేయాలని పేర్కొన్నారు. అలాగే టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లింపులు ఇవ్వాలన్నారు.